శ్రీ వేంకటేశ్వర స్వామి, గోదా సమేత రంగనాథ స్వామి ఆలయం, యామ్నం పేట, ఘట్కేసర్ దగ్గర, హైదరాబాద్.
హైదరాబాద్ లోని ఉప్పల్ సర్కిల్ నుండి సుమారు 15 కిలోమీటర్ల దూరంలో ఘట్కేసర్ కు ముందుగా వచ్చే రింగ్ రోడ్డు ను ఆనుకొని ఉన్న ఈ పురాతన ఆలయం షుమారు 400 వందల సంవత్సరాల క్రితం నాటిది. ఔరంగజేబు కాలంలో ధ్వంసం గావింపబడిన ఈ దేవాలయం దాతల సహకారంతో 2007 వ సంవత్సరంలో పునర్నిర్మాణం చేయబడినది.
ఇక్కడ ప్రధానాలయంలో వేంకటేశ్వర స్వామి, మహాలక్ష్మి, గోదాదేవి మరియు రంగనాథ స్వామి వార్ల ధ్రువ మూర్తులతో బాటు, ఉత్సవ మూర్తులు కూడా ఉన్నాయి. దాదాపు ఏడడుగుల పైగా ఉన్న వేంకటేశ్వర స్వామి వారి ధ్రువ మూర్తి అద్భుతంగా ఉంటుంది. ప్రక్కనే శయనమూర్తి అయిన "రంగనాథ స్వామి" వారి ఆలయం ఉంది. ఇక్కడ ప్రతి ఏడాది "వైకుంఠ ఏకాదశి" మరియు "సంక్రాంతి ముందు రోజు "గోదా కల్యాణం" వైభంగా జరుగుతాయి. ప్రధాన ఆలయాలతో బాటు, క్షేత్ర పాలకుడైన "హనుమాన్" ఆలయం కూడా ఉంది. ఈ ఆలయం కూడా అతి పురాతన మయినది. అలాగే, వినాయకుడు, రాజ రాజేశ్వరి, నాగ దేవత ఆలయాలు కూడా నిర్మించారు. రెండెకరాల పైబడి స్థలంలో చుట్టూ పచ్చని పొలాలతో రమణీయ వాతావరణం లో కాస్త ఎత్తులో నిర్మించిన ఆలయంలో విశాలమైన ప్రాంగణం కూడా ఉంది.
No comments:
Post a Comment