Wednesday, May 25, 2016
Tuesday, May 17, 2016
NARASIMHA JAYANTHI
ఉగ్ర వీరం మహ-విష్ణుం
జ్వలంతం సర్వతో ముఖం
నౄసింహం భిషణం భద్రం
మౄత్యోర్ మౄత్యుం నమామ్యాహం
Tuesday, May 3, 2016
Benefits Of Lemon
అమ్మ లాంటి నిమ్మ
1. రోజూ పరగడుపున ఒక గ్లాసుడు గోరువెచ్చని నీళ్ళలో ఒక నిమ్మకాయ రసం కలుపుకొని, కొంచెం ఉప్పు కలిపి తాగితే ఊబకాయం తగ్గుతుంది.
2. నిమ్మరసాన్ని తేనెతో కలిపి తీసుకుంటే, జీర్ణశక్తిబాగుంటుంది. ఒంట్లో కొవ్వు శాతం తగ్గుతుంది.
3. కొంచెం ఉప్పు, నిమ్మరసం, కొద్దిగా పసుపు కలిపి వారానికి రెండుసార్లయినా పళ్ళు తోముకుంటే పలువర మెరవడమే కాకుండా, చిగుళ్ళవ్యాధులు ఉన్న వారికి మంచి ఔషధంగా పనిచేస్తుంది.
4. ప్రయాణాలలో వాంతులతో బాధపడేవారు నిమ్మకాయ వాసన చూడడం, నిమ్మ చెక్కను చప్పరించినా చక్కని ఉపశమనం.
5. శరీరం నీరసించినపుడు సెలైన్‌కు ప్రత్యామ్నాయంగా కొబ్బరినీటిలో నిమ్మరసం పిండుకొని తాగడం వల్ల తక్షణ శక్తి కలుగుతుంది.
6. మంచి పోషకపదార్ధాలతోపాటు ఎక్కువగా నిమ్మరసం సేవిస్తూంటే స్త్రీలకు గర్భస్రావాలు జరగవు.
7. వేడివల్ల కలిగే జలుబుకు, నిమ్మషర్బత్ బాగా పనిచేస్తుంది.
8. వడదెబ్బ నిమ్మనీళ్ళలో ఉప్పు కలిపి తాగితే ఉపశమనం కలుగుతుంది.
నిమ్మ చేయు మేలు అమ్మ కూడా చేయదు
“నిమ్మ చేయు మేలు అమ్మ కూడా చేయదు” అన్నది ఒక తెలుగు లోకోక్తి. ఈ ఉక్తి ద్వారా నిమ్మకాయలోని గొప్పదనం తెలుస్తున్నది. అమ్మ ప్రేమ-మమత-వాత్సల్యాలను ఇవ్వగలదే కానీ, ఆరోగ్యాన్ని ఇవ్వలేదు కదా! నిమ్మ ఆ కొరతను తీరుస్తుందని వైద్యుల అభిప్రాయం. నిమ్మరసం వల్ల అనేక వ్యాధులు నివారింపబడతాయి.
- మలబద్ధకము, అజీర్ణం, అగ్నిమాంద్యం మొదలగు జీర్ణక్రియ వ్యాధుల్లో ప్రతీరోజూ రెండు పూటలా నిమ్మరసం త్రాగితే జీర్ణరసాలు చక్కగా ఊరుతాయి. ఆకలి పెరిగి, బరువు హెచ్చుతుంది.
- లావుగా ఉండేవారు ఆహారాన్ని తగ్గించి, రోజుకు రెండు మూడుసార్లు నిమ్మరసం సేవిస్తే, బరువు తగ్గుతుంది.
- రోజుకు నాలుగుసార్లు నిమ్మరసం త్రాగితే పచ్చకామెర్ల వ్యాధి తగ్గుతుంది.
- వేడినీటిలో నిమ్మరసం పిండి త్రాగితే ఉబ్బసం ఉపశమిస్తుంది.
- గజ్జి, తామర, చుండ్రు, పొడలు, వ్రణాలు, మొటిమలు, కుష్టు మొదలగు చర్మవ్యాధులకు నిమ్మరసాన్ని రెండు మూడుసార్లు రోజూ సేవించాలి. లాభం ఉంటుంది.
- గజ నిమ్మరసాన్ని (ఒక కాయ) 20 గ్రా. కొబ్బరినూనెలో పిండి, తలకూ, ముఖానికి, శరీరానికి రాసుకుని, ఎండలో 15 ని|| ఉండి తర్వాత స్నానం చేస్తే, అనేక చర్మ వ్యాధులు నివారితమౌతాయి. నిమ్మకాయను క్రిమిసంహారిణిగా కూడా ఉపయోగిస్తారు. ఆరోగ్యంగా ఉన్నవారు కూడా వారానికి ఒకమారు నిమ్మనూనె రుద్దుకుంటే చర్మానికి ఆరోగ్యం, కాంతి చేకూరుతాయి. నల్లమచ్చలు గలవారు ఈ నూనెను 40 రోజుల వరకు రుద్దుకుంటే, ఫలితం కనబడుతుంది.
- నంజు, నీరు, వాపులు కలవారు వేడినీటితో నిమ్మరసాన్ని త్రాగితే, మూత్రవిసర్జన అధికంగా జరిగి, రోగనివారణ అవుతుంది.
- మధుమేహం, రక్త మూత్రం, అతివేడి అగిర్త, ఎండదెబ్బ, వడదెబ్బ, మొదలగు వ్యాధులకు నిమ్మరసం బాగా ఉపయోగపడుతుంది.
- రక్తప్రసరం, శ్వేతప్రసరం, పాండువ, రక్తచీణ్త, క్షయ మొదలగు రోగాల్లో కూడా నిమ్మరసం ప్రయోజనకారిగా ఉంటుంది.
- కండ్ల కలకలు కంటి మసకలకు రెండు నిమ్మరసం చుక్కల్ని మూడు రోజులు వేసుకోవాలి; తగ్గుతాయి.
- చెవిలో కురుపు, చీము, బాధ ఉంటే, నిమ్మరసం చుక్కలు, కొబ్బరి నూనె కలిపి మూడు రోజులు వేసుకుంటే తగ్గిపోతాయి.
- నిమ్మతొక్కలు ఎండవేసి, కొన్ని ఉలవలు లేదా పెసలు కలిపి, మరపట్టించి, ఆ పిండిని చర్మానికి రాసుకుని స్నానం చేస్తే, చర్మం నిగ నిగ లాడుతూ ఉంటుంది.
- వివిధ వంటకాలల్లో నిమ్మకాయను ఉపయోగించవచ్చు.
- పచ్చి కూరలు సన్నగా తురిమి వాటిలో నిమ్మకాయ పిండుకుని తింటే, ఆరోగ్యం, రుచి రెండూ లభిస్తాయి.
- మజ్జిగలో నిమ్మకయ పిండుకుని త్రాగితే, వేడితాపం చల్లబడుతుంది.
- నిమ్మ పచ్చడి ఆరోగ్యదాయకం.
Wednesday, April 20, 2016
హనుమాన్ జయంతి
చైత్రశుద్ధ పౌర్ణమి నాడు జరుపుకునే హనుమాన్ జయంతి రోజున జిల్లేడు వత్తులు, నువ్వుల నూనెతో ఆంజనేయస్వామికి దీపం వెలిగిస్తే అష్టైశ్వర్యాలూ చేకూరుతాయి. హనుమాన్ జయంతి రోజు సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో హనుమాన్‌ను ఆలయంలో దర్శించుకుని, ఎర్రటి ప్రమిదల్లో జిల్లేడు వత్తులు, నువ్వులనూనెతో దీపమెలిగించే వారికి ఆయుర్దాయం, సుఖసంతోషాలు, అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పురోహితులు అంటున్నారు. ఇంకా హనుమంతుని ఆలయాల్లో ఆకుపూజ చేయించడం, హనుమాన్ కళ్యాణం జరిపే వారికి ఈతిబాధలు తొలగిపోతాయని విశ్వాసం. అలాగే గృహంలో పూజచేసే భక్తులు, పూజామందిరమును శుభ్రం చేసుకుని పసుపు, కుంకుమలు, పుష్పాలతో అలంకరించుకోవాలి. ఎర్రటి అక్షతలు, ఎర్రటి పువ్వులను పూజకు సిద్ధం చేసుకోవాలి. పూజకు పంచముఖాంజనేయ ప్రతిమను లేదా ఫోటోను ఎర్రటి సింధూరం, ఎర్రటి పువ్వులతో అలంకరించుకోవాలి. నైవేద్యానికి బూరెలు, అప్పాలు, దానిమ్మ పండ్లు సమర్పించుకోవచ్చు.
పూజా సమయంలో హనుమాన్ చాలీసా ఆంజనేయ సహస్రము, హనుమచ్చరిత్ర వంటి స్తోత్రాలతో మారుతిని స్తుతించుకోవాలి. లేదా “ఓం ఆంజనేయాయ నమః” అనే మంత్రాన్ని 108 సార్లు జపించి, ఐదు జిల్లేడు వత్తులను నువ్వుల నూనెతో తడిపిన పంచహారతిని స్వామివారికి అర్పించాలి. పూజ పూర్తయిన తర్వాత ఆంజనేయ ఆలయాలను సందర్శించుకోవడం మంచిది. ఇంకా అరగొండ, పొన్నూరు, కసాపురం, గండిక్షేత్రం వంటి పుణ్యక్షేత్రాలను దర్శించుకునే వారికి కోటి జన్మల పుణ్యఫలం సిద్ధిస్తుందని విశ్వాసం. ఇదే రోజున హనుమాన్ ధ్యాన శ్లోకములు, హనుమాన్ చాలీసా పుస్తకములు దానం చేసేవారికి సుఖసంతోషాలు చేకూరుతాయని నమ్మకం.
పూజా సమయంలో హనుమాన్ చాలీసా ఆంజనేయ సహస్రము, హనుమచ్చరిత్ర వంటి స్తోత్రాలతో మారుతిని స్తుతించుకోవాలి. లేదా “ఓం ఆంజనేయాయ నమః” అనే మంత్రాన్ని 108 సార్లు జపించి, ఐదు జిల్లేడు వత్తులను నువ్వుల నూనెతో తడిపిన పంచహారతిని స్వామివారికి అర్పించాలి. పూజ పూర్తయిన తర్వాత ఆంజనేయ ఆలయాలను సందర్శించుకోవడం మంచిది. ఇంకా అరగొండ, పొన్నూరు, కసాపురం, గండిక్షేత్రం వంటి పుణ్యక్షేత్రాలను దర్శించుకునే వారికి కోటి జన్మల పుణ్యఫలం సిద్ధిస్తుందని విశ్వాసం. ఇదే రోజున హనుమాన్ ధ్యాన శ్లోకములు, హనుమాన్ చాలీసా పుస్తకములు దానం చేసేవారికి సుఖసంతోషాలు చేకూరుతాయని నమ్మకం.
Tuesday, April 19, 2016
శ్రీ వేంకటేశ్వర స్వామి, గోదా సమేత రంగనాథ స్వామి ఆలయం
శ్రీ వేంకటేశ్వర స్వామి, గోదా సమేత రంగనాథ స్వామి ఆలయం, యామ్నం పేట, ఘట్కేసర్ దగ్గర, హైదరాబాద్.
హైదరాబాద్ లోని ఉప్పల్ సర్కిల్ నుండి సుమారు 15 కిలోమీటర్ల దూరంలో ఘట్కేసర్ కు ముందుగా వచ్చే రింగ్ రోడ్డు ను ఆనుకొని ఉన్న ఈ పురాతన ఆలయం షుమారు 400 వందల సంవత్సరాల క్రితం నాటిది. ఔరంగజేబు కాలంలో ధ్వంసం గావింపబడిన ఈ దేవాలయం దాతల సహకారంతో 2007 వ సంవత్సరంలో పునర్నిర్మాణం చేయబడినది.
ఇక్కడ ప్రధానాలయంలో వేంకటేశ్వర స్వామి, మహాలక్ష్మి, గోదాదేవి మరియు రంగనాథ స్వామి వార్ల ధ్రువ మూర్తులతో బాటు, ఉత్సవ మూర్తులు కూడా ఉన్నాయి. దాదాపు ఏడడుగుల పైగా ఉన్న వేంకటేశ్వర స్వామి వారి ధ్రువ మూర్తి అద్భుతంగా ఉంటుంది. ప్రక్కనే శయనమూర్తి అయిన "రంగనాథ స్వామి" వారి ఆలయం ఉంది. ఇక్కడ ప్రతి ఏడాది "వైకుంఠ ఏకాదశి" మరియు "సంక్రాంతి ముందు రోజు "గోదా కల్యాణం" వైభంగా జరుగుతాయి. ప్రధాన ఆలయాలతో బాటు, క్షేత్ర పాలకుడైన "హనుమాన్" ఆలయం కూడా ఉంది. ఈ ఆలయం కూడా అతి పురాతన మయినది. అలాగే, వినాయకుడు, రాజ రాజేశ్వరి, నాగ దేవత ఆలయాలు కూడా నిర్మించారు. రెండెకరాల పైబడి స్థలంలో చుట్టూ పచ్చని పొలాలతో రమణీయ వాతావరణం లో కాస్త ఎత్తులో నిర్మించిన ఆలయంలో విశాలమైన ప్రాంగణం కూడా ఉంది.
Subscribe to:
Posts (Atom)













